News February 22, 2025
శ్రీ సత్యసాయి: తెలుగు టీచర్ సస్పెండ్

తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యనారాయణ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో సూర్యనారాయణ రెడ్డి అరెస్టై అనంతపురం జిల్లా జైలులో ఉన్నారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతడిని సస్పెండ్ చేశామన్నారు.
Similar News
News March 16, 2025
ములుగు జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

ములుగు జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం ఇంకా వీడలేదు. కొంతమంది చేపలు, మటన్ వైపు మొగ్గు చూపుతుంటే, చికెన్ కొనుగోలు చేసి తింటున్నారు. జిల్లాలో చికెన్ ధరల్లో ప్రాంతాన్ని బట్టి మార్పులు ఇలా ఉన్నాయి. కేజీ చికెన్ రూ.220 ఉండగా.. స్కిన్లెస్ రూ. 240గా ఉంది. హోల్సేల్ రూ.80-90 ఉండగా, రిటైల్ 130 వరకు ధర పలుకుతుంది. ఈ చికెన్ ధరల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మార్పులు సైతం ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.
News March 16, 2025
భువనగిరి: గ్రేట్.. మూడు జాబ్స్ కొట్టాడు

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం రావడమే గగనం. అలాంటిది ఏకంగా 3 ఉద్యోగాలను కొల్లగొట్టి ఔరా అనిపించాడు భువనగిరి మండలం గౌస్ నగర్ గ్రామానికి చెందిన అజయ్ కుమార్ రెడ్డి. గ్రూప్-2లో 713, గ్రూప్-3లో 451వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్-4లో 336వ ర్యాంక్ సాధించి ఇప్పటికే కలెక్టర్ ఆఫీస్‌లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. దీంతో అజయ్‌కు తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
News March 16, 2025
జగిత్యాల జిల్లాలో చికెన్ ధరలు ఇలా

జగిత్యాల జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్ స్కిన్) కేజీ రూ.170-180 ఉండగా..స్కిన్‌లెస్ కేజీ రూ.200 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.120-130 మధ్య ఉంది. కాగా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా, ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ప్రతి ఆదివారం చికెన్ తినడం ఆనవాయితీగా మారింది.