News January 29, 2025

శ్రీ సత్యసాయి: ‘నా కోరిక తీర్చు.. లేదంటే చస్తా’

image

కదిరి పట్టణం అమీన్ నగర్‌లో ఓ మహిళను వేధిస్తున్న వ్యక్తిపై మంగళవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. ‘టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళను కొంతకాలంగా మాబు అనే వ్యక్తి తన కోరిక తీర్చాలంటూ వెంట పడి వేధించేవాడు. కోరిక తీర్చకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించేవాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు’ అని పేర్కొన్నారు. అతనిపై కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News December 1, 2025

శ్రీకాకుళం: కేంద్ర మంత్రి వర్యా ఆశలన్నీ మీపైనే..!

image

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు తద్వారా జిల్లా రైల్వేస్టేషన్లు అభివృద్ధి, పర్లాఖిమిడి-పలాస, కటక్ నూతన రైల్వే లైన్లు, మూలపేట-భోగాపురం కోస్టల్ కారిడార్ రహదారి నిర్మాణం, జిల్లాలో ప్రత్యేక ITDA ఏర్పాటు తదితర అంశాలు ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు.

News December 1, 2025

రుద్రంగిలో MLA ఆది శ్రీనివాస్ వాహనం తనిఖీ

image

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి చెక్ పోస్ట్ వద్ద వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు ఆపి క్షుణ్ణంగా చెక్ చేశారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

News December 1, 2025

పాలమూరు: పంచాయతీ ఎన్నికలు.. వారికి ప్రమాదం!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పంచాయితీ ఎన్నికల సందడి మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా.. బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.