News January 29, 2025
శ్రీ సత్యసాయి: ‘నా కోరిక తీర్చు.. లేదంటే చస్తా’

కదిరి పట్టణం అమీన్ నగర్‌లో ఓ మహిళను వేధిస్తున్న వ్యక్తిపై మంగళవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. ‘టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళను కొంతకాలంగా మాబు అనే వ్యక్తి తన కోరిక తీర్చాలంటూ వెంట పడి వేధించేవాడు. కోరిక తీర్చకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించేవాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు’ అని పేర్కొన్నారు. అతనిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News February 19, 2025
27న ఏలూరు జిల్లాలో సెలవు

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.
News February 19, 2025
బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా బైరి శంకర్

బీజేపీ సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షుడిగా బైరి శంకర్ ముదిరాజ్ నియామకం అయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ, సహా ఎన్నికల అధికారి గీతా మూర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా వంగ రామచంద్ర రెడ్డిని నియమించారు. తనకు బాధ్యతలు అప్పజెప్పిన పార్టీ పెద్దలందరికీ బైరి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
News February 19, 2025
VJA: యువతితో అసభ్య ప్రవర్తన.. ఇరువురిపై కేసు

యువతితో అసభ్యంగా ప్రవర్తించిన భార్యాభర్తల పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మాచవరం పోలీసుల వివరాల మేరకు.. విజయవాడలో ఓ యువతి ఇంటర్మీడియట్ చదువుతూ హాస్టల్లో ఉంటుంది. ఈ క్రమంలో హాస్టల్ వార్డెన్ కామేశ్వరరావు యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో యువతి కామేశ్వరరావు భార్య ఉమాదేవికి సమాచారం అందించినా ఆమె కూడా యువతి పై దుర్భాషలాడింది. దీంతో వారిరువురి పై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రకాశ్ తెలిపారు.