News February 7, 2025

శ్రీ సత్యసాయి: నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య

image

సోమందేపల్లి మండలం కేతగాని చెరువులో వివాహిత హిమజ(26) పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఆదర్శ్‌తో ఆమెకు వివాహమైంది. అప్పటి నుంచి అదే ఊరిలో దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

Similar News

News December 4, 2025

ENCOUNTER: 19కి చేరిన మృతుల సంఖ్య

image

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన <<18460138>>ఎన్‌కౌంటర్‌లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 19 మంది మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో PLGA-2 కమాండర్ వెల్లా మోడియం కూడా ఉన్నారు. భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు ఎదురుకాల్పుల్లో నిన్న ముగ్గురు పోలీసులు మరణించిన విషయం తెలిసిందే.

News December 4, 2025

దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు ప్రకాశం, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, CTR జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు రహదారులు, తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

News December 4, 2025

సంక్రాంతి బరిలో నెగ్గేదెవరో?

image

ఈసారి సంక్రాంతి బరిలోకి 7 సినిమాలు దిగనున్నాయి. ప్రభాస్ ‘రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అటు విజయ్ ‘జననాయకుడు’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ బరిలో ఉన్నాయి. పోటీలో గెలిచే ‘పందెం కోడి’ ఏదని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.