News February 7, 2025

శ్రీ సత్యసాయి: నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య

image

సోమందేపల్లి మండలం కేతగాని చెరువులో వివాహిత హిమజ(26) పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఆదర్శ్‌తో ఆమెకు వివాహమైంది. అప్పటి నుంచి అదే ఊరిలో దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

Similar News

News March 25, 2025

కొమరాడ: తండ్రి మరణం.. పది పరీక్షకు కుమారుడు

image

కొమరాడ మండలం అల్లవాడ గ్రామానికి చెందిన బిడ్డిక రామారావు సోమవారం ఉదయం అకాల మరణం పొందారు. చరణ్ పెద్దకుమారుడు పదో తరగతి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. తండ్రి మరణించిన బాధలోనే చరణ్ కన్నీరు పెట్టుకుంటూ గణితం పరీక్షకు వెళ్లాడు. పెద్దనాన్న కొడుకు బిడ్డిక సతీశ్ అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 25, 2025

39మంది ఎంపీలతో పీఎంను కలుస్తాం: స్టాలిన్

image

డీలిమిటేషన్ విషయంలో తమ రాష్ట్రానికి చెందిన 39మంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీని మీట్ అవుతామని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. ‘ఇటీవల ముగిసిన అఖిలపక్ష సమావేశంలో చేసిన తీర్మానాల ఆధారంగా తయారుచేసిన నివేదికను రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలందరితో కలిసి ప్రధానికి అందిస్తాం. తమిళనాడు పోరాటాన్ని ఆపదు. కచ్చితంగా ఈ పోరులో విజయం సాధిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.

error: Content is protected !!