News March 12, 2025

శ్రీ సత్యసాయి: పది పరీక్షల ఏర్పాట్లపై సూచనలు

image

పదో తరగతి పరీక్షల ఏర్పాటుపై శ్రీ సత్యసాయి జిల్లా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పలు సూచనలు చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ టీఎస్ చేతన్‌తో పాటు జాయింట్ కలెక్టర్ అభికుమార్, డీఆర్ఓ విజయసారథి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్ కోసం పలు సూచనలు చేశారు.

Similar News

News September 18, 2025

వరంగల్ మార్కెట్లో స్థిరంగా పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్థిరంగా ఉంది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7440 ధర పలకగా.. ఈరోజు సైతం అదే ధర పలికింది. కాగా, సోమవారం రూ.7,400 ధర పలకగా.. మంగళవారం రూ.7,480 అయింది. మార్కెట్లో కొనుగోలు-అమ్మకాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News September 18, 2025

సొంత నియోజకవర్గంలోనే పల్లాకు తలనొప్పి

image

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై TDP రాష్ట్ర అధ్యక్షుడు P.శ్రీనివాస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీ అధినేతగా రాష్ట్రవ్యాప్తంగా సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నా.. సొంత నియోజకవర్గంలో మాత్రం ప్లాంట్ ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది. ప్లాంట్ ప్రైవేటీకరణకు TDP కూడా కారణమని కార్మిక సంఘాల ఆరోపణలు, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఏమైయ్యాయి? అని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తుండడంతో పల్లాకు మరింత ఇబ్బందిగా మారింది.

News September 18, 2025

నేనూ బాధితుడినే: MLA విష్ణుకుమార్ రాజు

image

AP టిడ్కో గృహాల సమస్యలపై విశాఖ MLA విష్ణుకుమార్ రాజు గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. బెనిఫిషరీస్ టిడ్కో ఇండ్లలో దిగి రెండేళ్లు అవుతున్నా.. కాంట్రాక్టర్లకు మాత్రం ఇంత వరకు బిల్లులు చెల్లించలేదన్నారు. తాను కూడా ఒక బాధితుడినే అన్నారు. తన కంపెనీకి రావాల్సిన రూ.123 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జగన్ ప్యాలెస్ కట్టిన వారికి మాత్రం రూ.60 కోట్లను ఆర్ధిక శాఖ రిలీజ్ చేసిందన్నారు.