News March 12, 2025
శ్రీ సత్యసాయి: పది పరీక్షల ఏర్పాట్లపై సూచనలు

పదో తరగతి పరీక్షల ఏర్పాటుపై శ్రీ సత్యసాయి జిల్లా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పలు సూచనలు చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ టీఎస్ చేతన్‌తో పాటు జాయింట్ కలెక్టర్ అభికుమార్, డీఆర్ఓ విజయసారథి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్ కోసం పలు సూచనలు చేశారు.
Similar News
News March 17, 2026
రాజంపేటలో 6 బైకులు దగ్ధం

రాజంపేట పట్టణంలో సోమవారం రాత్రి 6 బైకులను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారని మోటర్ బైక్ మెకానిక్ అమీర్ తెలిపారు. ఈ ఘటన నూనెవారిపల్లి రోడ్డులో టెలిఫోన్ కార్యాలయం ఎదురుగా జరిగింది. తన వద్దకు రిపేరుకు వచ్చిన బైకులను రాత్రి సమయంలో షాపు సమీపంలో బయట ఉంచగా.. నిప్పు పెట్టి కాల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి తనకు తగిన న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు.
News March 17, 2026
19న ఘనంగా ఉగాది వేడుకల నిర్వహణ: VZM కలెక్టర్

శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈనెల 19న ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో జిల్లా స్థాయి కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. వేదిక అలంకరణ, పబ్లిక్ అడ్రస్ సిస్టం, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, తాగునీరు, తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News March 17, 2026
నల్గొండలో కల్తీపాల మాఫియా పంజా..!

పసిపిల్లలకు అమృతం కావాల్సిన పాలు.. నల్గొండ జిల్లా కేంద్రంలో విషతుల్యమవుతున్నాయి. నాగార్జునసాగర్ రోడ్డు కేంద్రంగా సాగుతున్న ‘కల్తీ’ దందా సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. డీఈఓ కార్యాలయం నుంచి సాగర్ ఐలమ్మ విగ్రహం వరకు యథేచ్ఛగా సాగుతున్న ఈ విక్రయాలపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలల్లో డిటర్జెంట్లు, యూరియా, ప్రమాదకర రసాయనాలు కలుపుతూ కొందరు వ్యాపారులు కాసుల వేటలో పడ్డారు.


