News January 3, 2025
శ్రీ సత్యసాయి: పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం కునుకుంట్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేసి అందులో ఎనుము పుర్రెను పెట్టి పూజలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాడిమర్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Similar News
News January 8, 2025
అనంతపురం జిల్లాలో ప్రధాని మోదీ చేతుల మీదుగా..
విశాఖ వేదికగా జిల్లాలోని పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ నేడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. వివరాలు ఇలా..
☛ రూ.160 కోట్లతో తాడిపత్రి బైపాస్ 4 వరుసల విస్తరణకు శంకుస్థాపన
☛ రూ.352 కోట్లతో గుత్తి-పెండేకల్లు రైల్వే డబ్లింగ్ పనులకు శంకుస్థాపన
☛ మడకశిర-సిర, ముదిగుబ్బ బైపాస్, బత్తలపల్లి-ముదిగుబ్బ నాలుగు వరుసల రహదారి ప్రారంభోత్సవం
☛ రూ.998 కోట్ల నిర్మించిన గుత్తి-ధర్మవరం రైల్వే లైన్ ప్రారంభోత్సవం
News January 8, 2025
అనంతపురం పోలీస్ గ్రౌండ్స్‌లో ‘డాకు’ ప్రీ రిలీజ్ ఈవెంట్
అనంతపురంలో రేపు జరగనున్న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మారింది. తొలుత ARTS కళాశాల మైదానంలో ఈవెంట్ ప్లాన్ చేయగా తాజాగా పోలీస్ గ్రౌండ్స్‌కు మార్చారు. దీంతో నిర్మాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, గ్లామర్ రోల్లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ అనంతకు తరలిరానున్నారు. మంత్రి నారా లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు.
News January 8, 2025
అనంతలో విషాదం.. వివాహిత ఆత్మహత్య
అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని వేణుగోపాల్ నగర్లో ఉండే పుష్పావతి అనే వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.