News March 22, 2025

శ్రీ సత్యసాయి: ప్రాథమిక అంశాలపై నివేదికల సమర్పించాలి

image

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాధాన్య అంశాల నివేదికలను తక్షణం సమర్పించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అన్ని విభాగాల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాకు సంబంధించిన ప్రగతి, ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రికి వివరించేందుకు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయాలన్నారు.

Similar News

News December 4, 2025

డిగ్రీ లేకపోయినా ఉద్యోగమిస్తా: జోహో CEO

image

జోహో సీఈవో శ్రీధర్ వెంబు సూపర్ ఆఫర్ ఇచ్చారు. నైపుణ్యం ఉంటే చాలని.. డిగ్రీ లేకుండానే ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. పిల్లలపై ఒత్తిడి పెట్టడం మానాలని భారతీయ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో యువత డిగ్రీ వదిలి నేరుగా ఉద్యోగాలను ఎంచుకుంటున్న ధోరణిని ఉదాహరణగా చూపించారు. Zohoలో ఏ ఉద్యోగానికీ డిగ్రీ క్రైటీరియా లేదని తెలిపారు. తనతో పనిచేస్తున్న టీమ్‌లో సగటు వయస్సు 19 ఏళ్లు మాత్రమేనని అన్నారు.

News December 4, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు HYD వ్యాప్తంగా ఫ్రీ బస్సులు

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌కు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 10 నుంచి 13 వరకు గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకునేందుకు MGBS, JBS, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్బీనగర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌కు వెళ్లేందుకు ఉ.9 నుంచి మ.1 వరకు, తిరిగి వచ్చేందుకు సా.4 నుంచి రాత్రి 9 వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి.

News December 4, 2025

NRPT: ‘నషా ముక్త్ భారత్’ అవగాహన వాహనం ప్రారంభం

image

మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు బ్రహ్మకుమారీల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రచార వాహనాన్ని గురువారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. సమాజ అభివృద్ధికి మాదక ద్రవ్యాల నిర్మూలన అత్యంత కీలకమన్నారు.