News February 15, 2025
శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకలపై 15 రోజులకోసారి సమీక్ష

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలపై 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో శత జయంతి ఉత్సవాల సందర్భంగా ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో బాబా పుట్టిన స్థలం, బాబా తల్లి ఉన్న ప్రాంతాలను గుర్తించి సుందరీకరణ పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
Similar News
News November 25, 2025
బల్మెర్ లారీలో ఉద్యోగాలు

<
News November 25, 2025
ప్రకాశంలోకి అద్దంకి, కందుకూరు.. కారణం ఇదే!

ప్రకాశం జిల్లా నుంచి సరికొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పడనున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రకాశం నుంచి అద్దంకి బాపట్లలోకి, కందుకూరు నెల్లూరులోకి వెళ్లాయి. అద్దంకి నుంచి బాపట్లకు 80 కి. మీ ఉండగా ఒంగోలుకు 40 కి.మీ మాత్రమే. కందుకూరుకు ఇదే సుదూర సమస్య. తాజాగా వీటిని ప్రకాశంలోకి కలిపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ కామెంట్!
News November 25, 2025
KMR: ఎన్నికల్లో మహిళలే కీలకం

కామారెడ్డి జిల్లాలో 25 మండలాల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 6,39,730 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో 3,07,508 మంది పురుషులు కాగా, 3,32,209 మంది మహిళలు ఉన్నారు. మరో 13 మంది ఇతరులు ఉన్నారు. ఈ లెక్కన పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలక పాత్ర పోషించనున్నారు.


