News March 22, 2024

శ్రీ సత్యసాయి: బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. యువకుడి మృతి

image

కదిరి మండలం కాళసముద్రంలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు అనంతపురం డిపోకు చెందినదిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 17, 2026

అనంతపురం జెడ్పీ సీఈఓగా విజయలక్ష్మి

image

గుంతకల్ డివిజనల్ లెవల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (DLDO)గా పనిచేస్తున్న పి.విజయలక్ష్మి పదోన్నతి పొంది, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె 15 రోజుల్లోగా నూతన బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

News April 17, 2026

పరిశ్రమలకు అనుమతులు వెంటనే ఇవ్వాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులకు సూచించారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం కల్పించాలని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, కొత్త పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సబ్సిడీలు ఇచ్చి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.

News April 17, 2026

జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: కలెక్టర్ ఆనంద్

image

జర్నలిస్టులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ఇటీవల మరణించిన జర్నలిస్టులు కాలువ రమణ, రవికుమార్ కుటుంబాలకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా యంత్రాంగం ఎప్పుడూ జర్నలిస్టులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.