News May 11, 2024
శ్రీ సత్యసాయి: బైక్, కారు ఢీకొని వ్యక్తి మృతి

ముదిగుబ్బ మండలంలోని జొన్నలకొత్తపల్లి, రాళ్ల అనంతపురం మధ్య చెన్నై జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఉప్పలపాడుకు చెందిన రఫీ అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Similar News
News September 18, 2025
ఆలూరు సాంబశివారెడ్డికి కీలక పదవి

అనంతపురం జిల్లా వైసీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డిని వైసీపీ స్టేట్ అడ్మిన్ హెడ్గా నియమిస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాంబశివారెడ్డిని స్టేట్ అడ్మిన్ హెడ్గానూ నియమించినట్లు చెప్పింది. ఈ నియామకంపై సాంబశివారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం చేయడానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.
News September 18, 2025
గుంతకల్లుకు నటి నిధి అగర్వాల్

ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఈ నెల 22న గుంతకల్లుకు రానున్నారు. ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి ఆమె రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’లో నటించిన ఆమె ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు.
News September 18, 2025
ఈ బస్సులో స్త్రీ శక్తి పథకం వర్తించదు.. ఎక్కడో తెలుసా..!

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. కానీ అనంతపురం జిల్లాలో తాడిపత్రి నుంచి పుట్లూరు మీదుగా గరుగుచింతలపల్లికి వెళ్లే రూట్లో మాత్రం ఉచిత ప్రయాణం అమలు కావటం లేదు. ‘మా గ్రామాలకు ఒక్క బస్సు మాత్రమే ఉంది. దిక్కు లేక టికెట్ కొనుక్కుని వెళ్తున్నాం’ అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.