News March 3, 2025
శ్రీ సత్యసాయి: మంత్రి సవిత తీపి కబురు

ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం తల్లికి వందనం అందజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదివారం పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష మంది మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణతో పాటు మిషన్లను అందజేస్తామన్నారు.
Similar News
News October 19, 2025
భువనగిరి: ఎక్స్పైరీ ఇంజెక్షన్ ఇచ్చిన ఇద్దరు సస్పెండ్

తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గడువు ముగిసిన ఇంజెక్షన్ ఇచ్చిన ఘటనపై కలెక్టర్ హనుమంతరావు కఠిన చర్యలు తీసుకున్నారు. విచారణలో నిర్లక్ష్యం రుజువు కావడంతో NHM రజిత, ఫార్మసీ ఆఫీసర్ మహేశ్వరిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
News October 19, 2025
విజయం దిశగా భారత్

ఉమెన్ వరల్డ్ కప్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70) రన్స్ చేసి ఔటయ్యారు. ఓపెనర్ స్మృతి మంధాన (63*) క్రీజులో ఉన్నారు. కౌర్, స్మృతి 120కి పైగా భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 31 ఓవర్లలో 170/3గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి 114 బంతుల్లో 119 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News October 19, 2025
లేగదూడను చూసి CM మురిసే!

యాదవుల సదర్ అంటే CM రేవంత్ రెడ్డికి మక్కువ అని చెప్పడానికి ఈ ఫొటో చక్కటి ఉదాహరణ. NTR స్టేడియం వద్ద నిర్వహించిన సదర్‌లో రేవంత్ ఏ ఒక్కరినీ నిరాశ పర్చలేదు. కళాకారుల నుంచి యువత వరకు అందరినీ పలకరించారు. యాదవ సోదరులతో ఫొటోలు దిగి సంభాషించారు. వేదిక ఎక్కిన తర్వాత అందంగా అలంకరించిన ఓ లేగదూడను చూసి ఆయన ముగ్ధుడయ్యారు. ఆ దూడెను తన దగ్గరకు తీసుకోవడం సదర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.