News January 29, 2025
శ్రీ సత్యసాయి: మాతృ, శిశు మరణాలపై సమీక్ష

శ్రీ సత్యసాయి జిల్లాలో మాతృ, శిశు మరణాలపై జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సమీక్ష నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రోజా బేగం ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి, కలెక్టర్ పలు సూచనలు చేశారు. సత్యసాయి జిల్లాలో మాతృ, శిశు మరణాలు తగ్గించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
Similar News
News November 25, 2025
సూర్యాపేట: నామినేషన్ వేస్తే ఏకగ్రీవమే!

త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో నూతనకల్ మండలం పెదనెమిల జీపీలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. పెదనెమిల జీపీలోని 1వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎస్టీ వర్గానికి చెందిన ఓటరు ఒక్కరే ఉండటం విశేషం. నామినేషన్ వేసే ప్రక్రియ పూర్తయితే, వార్డు మెంబర్ ఏకగ్రీవం కానుంది.
News November 25, 2025
తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఫైల్స్ వేగంగా ముందుకు కదులుతున్నాయి. సంబంధిత అలైన్‌మెంట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి SCR పంపింది. ముందుగా గూడూరు స్టాఫింగ్ అనుకునప్పటికీ తిరుపతిలో స్టాఫింగ్ ఉండేలా ప్లాన్ చేయాలని TN ప్రభుత్వం కోరింది. త్వరలోనే ఈ DPR పూర్తి కానుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం 12గంటలుండగా బుల్లెట్ ట్రైన్లో కేవలం 2.20 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ మార్గంలో 11.6KM సొరంగం ఉంటుంది.
News November 25, 2025
ప్రారంభమైన ఆట.. బౌలర్లే దిక్కు

సౌతాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఇప్పుడు భారమంతా బౌలర్లపైనే ఉంది. 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో SA 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆ జట్టు 314 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. SAను త్వరగా ఆలౌట్ చేయకుంటే ఇండియా ముందు కొండంత లక్ష్యం పేరుకుపోవడం ఖాయం. బౌలర్లు ఏం చేస్తారో చూడాలి మరి.


