News June 14, 2024
శ్రీ సత్యసాయి: రోల్‌వెల్ పరిశ్రమలో వ్యక్తి మృతి
హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలోని రోల్‌వెల్ పరిశ్రమలో శుక్రవారం ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. కొటిపి ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ(44) రోల్‌వెల్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రోజులాగే గురువారం విధులకు వెళ్లి మృతిచెందాడు. గుండెపోటుతో మృతి చెందాడా? లేక ప్రమాదం ఏమైనా సంభవించిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 19, 2024
ఉచిత ఇసుకను పారదర్శకంగా అందించేందుకు ఏర్పాట్లు: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఇసుక పాయింట్ల వద్ద నుంచి ఉచిత ఇసుకను పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అధికారులతో మాట్లాడారు. ఉచిత ఇసుక కోసం ప్రజలు ఆన్లైన్లో సులభతరంగా నమోదు చేసుకుని ప్రక్రియను క్రమబద్ధమైన రీతిలో రూపొందించామన్నారు.
News September 19, 2024
రూ.33 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల అరెస్టు: ఎస్పీ
ధర్మవరంలో ముంబై పోలీసులమని చెప్పి సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.33 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. ధర్మవరం ఒకటో పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నరేశ్ గోయల్ అనే వ్యక్తి రూ.500 కోట్లు బ్యాంక్‌లో రుణం తీసుకుని మీ ఖాతాకు రూ.20 లక్షలు మళ్లించారని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడించారు.
News September 19, 2024
సాగునీటి సలహా మండలి సమావేశం ప్రారంభం
అనంతపురం కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవనంలో సాగునీటి సలహా మండలి సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో సాగునీటి సలహా మండలి సమావేశం జరగగా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీశ్, జడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, కళ్యాణదుర్గం, శింగనమల, తాడిపత్రి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.