News February 22, 2025

శ్రీ సత్యసాయి: ‘లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి’

image

శ్రీ సత్యసాయి జిల్లాలో లాంగ్ పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు జిల్లాలోని లాంగ్ పెండింగ్ కేసులతో పాటు ముఖ్యమైన కేసులపై దృష్టి సారించాలని ఆదేశించారు. రహదారి ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News November 22, 2025

దూసుకొస్తున్న అల్పపీడనం.. ఎల్లో అలర్ట్

image

AP: దక్షిణ అండమాన్ సముద్రం-మలక్కా మధ్య అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 24న వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News November 22, 2025

నిర్మల్ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

image

నిర్మల్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు నడుపనున్నట్లు డిపో అధికారులు తెలిపారు. డిసెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు నిర్మల్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీలో తిరుపతి, కాణిపాకం దేవస్థానాలు కూడా దర్శించుకోవచ్చు. ఒక్కొక్కరికి చార్జి రూ.6,300 గా నిర్ణయించారు. ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. వివరాల కోసం 9959226003, 8328021517, 7382842582 నంబర్లలో సంప్రదించండి.

News November 22, 2025

నవజాత శిశువుల్లో మూర్ఛ

image

సాధారణంగా మూర్ఛ చిన్నవయసులో/ 60ఏళ్లు పైబడిన వారికి ఎక్కువగా వస్తుంటుంది. కానీ కొన్నిసార్లు నవజాత శిశువులకూ మూర్ఛ వస్తుందంటున్నారు నిపుణులు. దీన్నే నియోనాటల్ మూర్ఛ అంటారు. దీనివల్ల భవిష్యత్తులో ఎదుగుదల లోపాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా లక్షలో ఒకరిని ప్రభావితం చేస్తాయి. దీని సంకేతాలు సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి చిన్నారి కదలికలు అసాధారణంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.