News February 22, 2025
శ్రీ సత్యసాయి: ‘లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి’

శ్రీ సత్యసాయి జిల్లాలో లాంగ్ పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు జిల్లాలోని లాంగ్ పెండింగ్ కేసులతో పాటు ముఖ్యమైన కేసులపై దృష్టి సారించాలని ఆదేశించారు. రహదారి ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News March 19, 2025
ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రి దామోదర్ కామెంట్స్

ఎస్సీ వర్గీకరణ హేతు వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం ఇదో చారిత్రాత్మకమైన రోజు అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వివక్షను రూపుమాపేందుకు తెచ్చిన రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణ బిల్లును తెచ్చామని మంత్రి వెల్లడించారు.
News March 19, 2025
గుంటూరు మేయర్ ఎంపికపై ఉత్కంఠ

కావటి మనోహర్ మేయర్ పదవికి రాజీనామా చేయడంతో గుంటూరులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీంతో తాత్కాలిక మేయర్ రేసులో కోవెలమూడి, కొందరు సీనియర్ కార్పొరేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్నవారిని తాత్కాలిక మేయర్‌గా నియమిస్తారు. దీంతో కూటమి తరఫున సజీలను నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె కంటే తానే సీనియర్‌ని అని డైమండ్ బాబు(YCP) అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.
News March 19, 2025
సన్నబియ్యం కోసం చూస్తే దొడ్డు బియ్యం కూడా ఇవ్వలేదు: KTR

TG: సామాన్యులకు రేషన్ బియ్యం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని KTR విమర్శించారు. ‘మార్చి నుంచి సన్నబియ్యం ఇస్తామన్న ప్రభుత్వం పదో తేదీ దాటినా రేషన్ బియ్యం ఇవ్వలేదు. సన్నబియ్యం కోసం చూస్తే కనీసం దొడ్డు బియ్యం కూడా రాలేదు. లక్ష 54 వేల మెట్రిక్ టన్నులకు గాను రేషన్ దుకాణాలకు కేవలం 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసింది’ అని ట్వీట్ చేశారు. మీకు ఈనెల రేషన్ వచ్చిందా? COMMENT.