News January 27, 2025
శ్రీ సత్యసాయి: ‘వాటర్ బాటిల్ అడిగి.. మెడలో గొలుసు లాక్కెళ్లారు’

నల్లమాడ పరిధిలోని దోన్నికోట చెర్లోపల్లిలో ఆదివారం రత్నమ్మ అనే మహిళ మెడలోని 40 గ్రాముల బంగారు గొలుసును ఇద్దరు దొంగలు లాక్కెళ్లారు. సీఐ నరేందరరెడ్డి వివరాల మేరకు.. బజ్జీ కొట్టుతో జీవించే రత్నమ్మ దగ్గరికి ఇద్దరు బైకులో వచ్చి వాటర్ బాటిల్ అడిగారు. బాటిల్ ఇస్తున్న క్రమంలో మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయినట్లు ఫిర్యాదు అందిదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
Similar News
News November 9, 2025
ఈనెల 11న ములుగులో ‘ఐక్యత పాదయాత్ర’

‘ఏక్ భారత్ – ఆత్మ నిర్భర భారత్’ నినాదంతో ఈ నెల 11న ఉదయం ములుగులో జిల్లా స్థాయి ఐక్యత పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. యువతలో దేశభక్తి, ప్రజల్లో సమైక్యతను పెంచేందుకు ఈ యాత్రను చేపట్టారు. ఉదయం 9:30 గంటలకు ఫారెస్ట్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు జరిగే ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
News November 9, 2025
వేములపల్లిలో ఉరేసుకుని వివాహిత మృతి

ఉరివేసుకుని వివాహిత మృతి చెందిన ఘటన ఆదివారం ద్వారపూడి శివారు వేములపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. ముమ్మిడివరం (m) సోమదేవరపాలెంకు చెందిన మట్టా రేఖ (24) వేములపల్లిలో పాకలో ఉరివేసుకుని మృతి చెందింది. వేములపల్లిలో తండ్రి ఇంటికి 4నెలల క్రితం కాన్పుకోసం వచ్చింది. ఫోన్లో ఆమె భర్త వేణుతో గొడవ పడినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.
News November 9, 2025
పేకాట శిబిరంపై దాడి.. రూ.68,920 సీజ్: సీఐ

కురుపాం మండలం సింగుపురం సమీపంలో పేకాట శిబిరంపై సీఐ బి.హరి ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకొని వారి వద్ద ఉన్న రూ.68,920 సీజ్ చేశామని సీఐ తెలిపారు. పట్టుబడినవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఎస్సైలు నారాయణరావు, శివప్రసాద్, పోలీస్ సిబ్బంది


