News August 10, 2024
శ్రీ సత్యసాయి: వైఎస్సార్‌టీఏ నూతన అధ్యక్షుడిగా రమణారెడ్డి
శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా రమణారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం పుట్టపర్తిలో జరిగిన సమావేశంలో వైఎస్ఆర్‌టీఏ కార్యవర్గ ఎన్నిక జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జంషీద్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమణారెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శిగా ఇంద్రప్రసాద్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
Similar News
News September 13, 2024
ఆలూరు కోన శ్రీ రంగనాథస్వామి ఆలయ హుండీ లెక్కింపు
తాడిపత్రి మండల పరిధిలోని ఆలూరు కోనలో వెలసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో గురువారం ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఎండోమెంట్ అధికారులు నిర్వహించారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి వన్నూరు స్వామి ఆధ్వర్యంలో ఆగస్టు 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు వచ్చిన హుండీని ఆలయ అర్చకులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో లెక్కించారు. రూ.27,24,184ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News September 12, 2024
‘ఉరవకొండ’ పేరు వెనుక ఇదీ చరిత్ర!
ఉరవకొండ పేరు వినగానే కొండ గుర్తుకొస్తుంది. పట్టణంలోని ఈ కొండకు ఘన చరిత్రే ఉంది. పాముపడగ ఆకారంలో కొండ ఉండటంతో పూర్వం ఈ పట్టణాన్ని ఉరగాద్రి అని పిలిచే వారట. సంస్కృతంలో ఉరగ అంటే పాము పడగ, అద్రి అంటే కొండ అని అర్థం. కాలక్రమేణా ఉరవకొండగా మారింది. చిక్కన్న అనే పాలేగాడు ఇక్కడ కోట బురుజు నిర్మించుకుని, కొంతకాలం సామంత పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పట్టణం కొండ చుట్టూ అభివృద్ధి చెందుతుండటం విశేషం.
News September 12, 2024
బీటెక్, MBA, MCA, M.SC ఫలితాల విడుదల
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని బీటెక్ సప్లిమెంటరీ (R15, R19), MBA (R17, R21), MCA (R20, R21), M.SC (R20, R21) ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.