News February 5, 2025
శ్రీ సత్యసాయి: హెచ్ఎంపై పోక్సో కేసు నమోదు

మద్యం తాగి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెచ్ఎంపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ బోయ శేఖర్ తెలిపారు. గోరంట్లలోని ఎంపీపీ వంక స్కూలులో హెచ్ఎం నాగేశ్వరరావు మద్యం తాగి ఆడ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవహిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎంపై పోక్సో కేసు నమోదు చేశామని, ఘటనపై విచారిస్తున్నామని సీఐ తెలిపారు.
Similar News
News December 1, 2025
పాతబస్తీలో అండర్‌గ్రౌండ్ సర్జరీ!

మెట్రో రైలు ఫేజ్-II (MGBS-చాంద్రాయణగుట్ట) కారిడార్‌లో పాతబస్తీకి శాశ్వత పరిష్కారం దక్కనుంది. కేవలం ఆరు నెలల్లోనే రూ.39.6 కోట్లతో కీలక జల వసతి పనులు పూర్తి చేయాలని HMWSSB నిర్ణయించింది. మైసారం, అలియాబాద్, మిస్రిగంజ్, దారుల్షిఫా, మొఘల్‌పురా, జంగంమెట్, గౌలిపురా, ఎంఆర్జీ ప్రాంతాల మీదుగా ఉన్న 100-1200 mm డయా తాగునీరు, డ్రైనేజీ లైన్లను మెట్రో పిల్లర్ల మార్గం నుంచి పూర్తిస్థాయిలో మార్చనున్నారు.
News December 1, 2025
విధులకు గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు: కలెక్టర్

విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్రజా వేదికకొచ్చే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాటిపై అవగాహన పెంచుకోవాలని అధికారులకు సూచించారు.
News December 1, 2025
అఫ్గాన్‌తో ట్రేడ్ వార్.. నష్టపోతున్న పాక్

అఫ్గాన్‌తో ట్రేడ్ వార్ పాక్‌ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆపేయడంతో పాక్‌లోని సిమెంట్ ఇండస్ట్రీ నష్టపోతోంది. అఫ్గాన్ నుంచి కోల్ దిగుమతి లేకపోవడంతో సౌతాఫ్రికా, ఇండోనేషియా, మొజాంబిక్ నుంచి అధిక ధరలకు సిమెంట్ ఫ్యాక్టరీలు బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాయి. 48 రోజుల నుంచి బార్డర్లు క్లోజ్ కావడంతో మందులు, అగ్రికల్చర్ గూడ్స్‌తోపాటు పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయి.


