News February 5, 2025

శ్రీ సత్యసాయి: హెచ్ఎంపై పోక్సో కేసు నమోదు

image

మద్యం తాగి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెచ్ఎంపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ బోయ శేఖర్ తెలిపారు. గోరంట్లలోని ఎంపీపీ వంక స్కూలులో హెచ్‌ఎం నాగేశ్వరరావు మద్యం తాగి ఆడ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవహిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్‌ఎంపై పోక్సో కేసు నమోదు చేశామని, ఘటనపై విచారిస్తున్నామని సీఐ తెలిపారు.

Similar News

News March 14, 2026

పుతిన్ ప్రపోజల్‌కు నో చెప్పిన ట్రంప్!

image

ఇరాన్ వద్ద ఉన్న 450 కిలోల (60% శుద్ధి చేసిన) యురేనియంను రష్యాకు తరలించాలని పుతిన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. యుద్ధాన్ని ఆపేందుకు ఇది ఒక మార్గమని పుతిన్ చెప్పినట్లు తెలిపింది. ఈ యురేనియంతో సుమారు 11 అణు బాంబులను తయారు చేయవచ్చని సమాచారం. అందుకే ఈ యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవాలి లేదా పనికిరాకుండా చేయాలని US ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

News March 14, 2026

విశాఖ: ‘నేడు పాఠశాలల సెలవు రద్దు’

image

జిల్లాలో మార్చి రెండో శనివారం ఇవ్వాల్సిన సెలవును రద్దు చేస్తూ డీఈఓ ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘మొంథా’ తుపాన్ ప్రభావంతో వరుస సెలవులు ప్రకటించడంతో, ఆ రోజుకు బదులుగా ఈరోజు పని దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.

News March 14, 2026

రాజధాని అమరావతి రైతులకు APCRDA విజ్ఞప్తి

image

అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే “గ్రీవెన్స్ డే” కార్యక్రమం మార్చి 14న తాత్కాలికంగా రద్దు చేశారు. రెండవ శనివారం కావడంతో నిర్వహణ కారణాల రీత్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంత రైతులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.