News March 13, 2025

శ్రీ సత్యసాయి: 15న స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

image

స్వచ్ఛ ఆంధ్ర, హరితాంద్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ శనివారం నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రధాన అంశంగా కార్యక్రమం జరుగుతుందన్నారు.

Similar News

News November 24, 2025

చందూర్: పదో తరగతి విద్యార్థి సూసైడ్

image

నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థి గతరాత్రి గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రిన్సిపల్..పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఎస్సై సాయన్న తెలిపారు.

News November 24, 2025

HYD: ప్రాణాలు పోతున్నాయి.. జాగ్రత్త!

image

వేగం మానుకో అని పోలీసులు ఎంత చెబుతున్నా కొందరు రైడర్లు ఆ మాటను పెడచెవిన పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌తో ఇటీవల HYDలో పదుల సంఖ్యలో చనిపోయారు. సెల్ఫ్ డ్రైవింగ్‌లో చేసిన తప్పిదాలు, డివైడర్లు, <<18366739>>మెట్రో పిల్లర్ల గోడలను<<>> ఢీ కొట్టిన ఘటనలూ ఉన్నాయి. అల్వాల్‌లో ఇవాళ ఉ. ఓ కారు దుకాణాల మీదకు దూసుకురాగా.. సదరు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సో.. హైదరాబాదీ ఇకనైనా స్వీడ్ తగ్గించు.

News November 24, 2025

ఎన్నికలపై విచారణ వాయిదా

image

TG: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. కాగా కోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయనుంది.