News March 20, 2025
శ్రీ సత్యసాయి: 171 మందికి బదిలీలు

జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 171 మందికి బదిలీ ప్రక్రియ నిర్వహించినట్లు డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ క్యాడర్‌లలో పనిచేస్తున్న వారికి గురువారం బదిలీలు చేపట్టామన్నారు. 21 మంది ఏపీవోలు, 50 మంది కోఆర్డినేటర్స్, 18 మంది ఈసీ, 81 మంది టెక్నికల్ అసిస్టెంట్ల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు.
Similar News
News April 1, 2025
ఈ 3 నెలలు మంటలే.. జాగ్రత్త: IMD

ఈ ఏడాది APR-JUNE మధ్య దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు నమోదవుతాయని IMD వెల్లడించింది. AP, TG, UP, WB, TN, MP, రాజస్థాన్, గుజరాత్, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, కర్ణాటకలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. విద్యుత్ డిమాండ్ 9-10% అధికంగా ఉంటుందని పేర్కొంది. గత ఏడాది మే 30న 250 గిగావాట్ల డిమాండ్ నమోదైన విషయం తెలిసిందే.
News April 1, 2025
వరంగల్: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సురేఖ

వరంగల్ పట్టణ పరిధిలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఇలా ఖిల్లా ఈద్గాలో ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నెల రోజులు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉండి రంజాన్ పండుగను జరుపుకుంటారని అన్నారు. ముస్లింల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
News April 1, 2025
NRPT: ‘ఎక్కువ మంది దరఖాస్తు చేసేలా చూడాలి’

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు. పథకంపై నిరుద్యోగులకు అవగాహన కల్పించాలని అన్నారు.