News January 26, 2025

శ్రీ సత్యసాయి: PIC OF THE DAY

image

బత్తలపల్లి మండల కేంద్రంలో తమ చిన్నారిని త్రివర్ణ పతాకం డ్రస్సుతో అలంకరించి భారతదేశంపై ఉన్న అభిమానాన్ని ఓ ముస్లిం కుటుంబం చాటుకుంది. సయ్యద్ దాదాపీర్, సయ్యద్ ఫర్హాన దంపతులు తమ చిన్నారి అర్ఫాకు త్రివర్ణ పతాకం రంగులతో కూటిన డ్రెస్‌ను అలంకరించారు. జాతీయ జెండాను పట్టుకొని బత్తలపల్లి 4 రోడ్ల కూడలిలో జై భారత్.. జై భారత్.. అంటూ భారతదేశం గొప్పతనం గురించి కొనియాడారు.

Similar News

News September 15, 2025

పెద్ద గంట్యాడలో ఉచిత శిక్షణ

image

ఏపీ ప్రభుత్వం స్థాపించిన నేక్ ఆధ్వర్యంలో బ్రాడ్ బాండ్ టెక్నీషియన్ కోర్స్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సోమవారం తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి 18-40 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులన్నారు. 3 నెలల శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి కల్పిస్తారన్నారు. పెద్ద గంట్యాడ నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని తెలిపారు.

News September 15, 2025

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

image

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి చెందిన ఘటన చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో చోటుచేసుకుంది. కుమారుడు చక్రపు వాసు నిన్న అనారోగ్యంతో మృతి చెందడంతో తల్లి శాంతమ్మ (90) మనోవేదనకు గురయ్యారు. ఈ విషాదాన్ని భరించలేక సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.

News September 15, 2025

SRCL: ‘గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహారం వండాలి’

image

గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం చింతల్ఠాణా ఆర్&ఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్తి చేసిన కిచెన్ షెడ్, విద్యాలయ ఆవరణను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. విద్యాలయ ఆవరణలో నీరు నిలవకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బిందికి సూచించారు.