News January 26, 2025
శ్రీ సత్యసాయి: PIC OF THE DAY

బత్తలపల్లి మండల కేంద్రంలో తమ చిన్నారిని త్రివర్ణ పతాకం డ్రస్సుతో అలంకరించి భారతదేశంపై ఉన్న అభిమానాన్ని ఓ ముస్లిం కుటుంబం చాటుకుంది. సయ్యద్ దాదాపీర్, సయ్యద్ ఫర్హాన దంపతులు తమ చిన్నారి అర్ఫాకు త్రివర్ణ పతాకం రంగులతో కూటిన డ్రెస్‌ను అలంకరించారు. జాతీయ జెండాను పట్టుకొని బత్తలపల్లి 4 రోడ్ల కూడలిలో జై భారత్.. జై భారత్.. అంటూ భారతదేశం గొప్పతనం గురించి కొనియాడారు.
Similar News
News February 11, 2025
భద్రాద్రి: విధుల్లోనూ విడవని తల్లి ప్రేమ

తల్లి ప్రేమ ముందు ఏదీ పనికి రాదని మరోసారి నిరూపితమైంది. మంగళవారం భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఏఎన్ఎంల ట్రైనింగ్‌కు పలువురు హాజరయ్యారు. ఇందులో భాగంగా పినపాకకు చెందిన ఏఎన్ఎం శ్రీ రేఖ తన ఐదు నెలల కుమారుడితో హాజరైంది. బుడ్డోడిని పడుకోబెట్టేందుకు ఆమె కలెక్టరేట్ ఆవరణలో చీరతో ఉయ్యాల కట్టి పడుకోబెట్టి, విరామ సమయంలో వచ్చి లాలించారు. ఈ తల్లి ప్రేమను చూసి సహ ఉద్యోగులు అభినందిస్తున్నారు.
News February 11, 2025
మన్యం బంద్ నిర్ణయం వెనక్కి

AP: స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా చేపడుతున్న మన్యం బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అఖిలపక్ష నేతలు ప్రకటించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 1/70 చట్టం అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన <<15427067>>హామీ<<>> ఇవ్వడంతో రేపు నిర్వహించతలపెట్టిన బంద్‌ను రద్దు చేస్తున్నట్లు నేతలు తెలిపారు.
News February 11, 2025
తాడ్వాయిలో టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం తాడ్వాయిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడ్వాయి గ్రామానికి చెందిన మైసయ్య(50) గ్రామపంచాయతీలో వర్కర్‌గా పని చేస్తున్నారు. టిప్పర్ వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని అతని కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయారని స్థానికులు పేర్కొన్నారు.