News September 5, 2024
శ్రీ సత్యాసాయి: పోలీస్ స్టేషన్‌లో కంప్యూటర్ చోరీ.. వ్యక్తి అరెస్ట్
గత నెల 20న రాత్రి నల్లమాడ పోలీస్ స్టేషన్‌లో కంప్యూటర్ చోరీ చేసిన దొంగను బుధవారం ఇన్‌ఛార్జ్ ఎస్ఐ వెంకటరమణ స్థానిక వైఎస్సార్ సర్కిల్లో అరెస్టు చేశారు. కేసు వివరాలను సీఐ వై.నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుడు సాయికుమార్ నుంచి కంప్యూటర్ రికవరీ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
Similar News
News September 12, 2024
అనంతపురంలో క్రికెటర్ల ప్రాక్టీస్
అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. హోటళ్ల నుంచి ప్రత్యేక బస్సుల్లో స్టేడియానికి చేరుకున్న ప్లేయర్లు నెట్స్‌లో చెమటోడ్చారు. డీ టీమ్ కెప్టెన్ అయ్యర్ సుమారు గంట పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. మిగిలిన ప్లేయర్లు క్యాచింగ్, బంతి త్రో, వ్యాయామం వంటివి చేశారు. ఆటగాళ్లను బయటి వ్యక్తులు కలవకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. గురువారం నుంచి రౌండ్ 2 పోటీలు ప్రారంభం కానున్నాయి.
News September 11, 2024
తాడిపత్రికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
తాడిపత్రి ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో తాటిపల్లిగా పేరొందింది. తర్వాత తాటిపర్తిగా, కొన్నేళ్ల నుంచి తాడిపత్రిగా పిలవబడుతోంది. పూర్వం ఈ ప్రాంతంలో తాటిచెట్లు ఎక్కువగా ఉండటంతో తాటిపల్లి అనే పేరు వచ్చిందట. అలాగే తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించడంతోనూ ఆ పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఇక పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని రామలింగనాయడు, చింతల వెంకటరమణస్వామి ఆలయాన్ని ఆయన కుమారుడు నిర్మించారట.
News September 11, 2024
ఓబులదేవర చెరువు మండలంలో పర్యటించిన కలెక్టర్
ఓబులదేవర చెరువు మండలంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహమ్మదా బాద్ చెత్త శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన మొక్కలు నాటారు.క లెక్టర్ మాట్లాడుతూ.. నాటిన మొక్కలు పరిరక్షించాలని కోరారు. వీటి ద్వారా భవిష్యత్‌లో ఆర్థిక స్వాలంబన లభిస్తుందని తెలిపారు.