News January 26, 2025
శ్రీ సత్య సాయి జిల్లాలో 561 మందికి ఉత్తమ సేవా పురస్కారాలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలు అందించిన 561 మందిని ఉత్తమ సేవా అవార్డులకు ఎంపిక చేశారు. నేడు పుట్టపర్తిలోని శిరసాని హిల్స్ వద్ద పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగే గణతంత్ర వేడుకలలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఉత్తమ సేవ ప్రశంసా పత్రాలను అందజేయనున్నారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో పాటు డివిజన్ మండల శాఖల ఉద్యోగులను ఎంపిక చేశారు.
Similar News
News November 17, 2025
శుభ సమయం (17-11-2025) సోమవారం

✒ తిథి: బహుళ త్రయోదశి తె.5.09 వరకు
✒ నక్షత్రం: చిత్త తె.5.20 వరకు
✒ శుభ సమయాలు: సా.7.45-8.10.
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12 వరకు, మ.2.46-3.34
✒ వర్జ్యం: మ.12.04-1.40
✒ అమృత ఘడియలు: రా.10.49-12.31
News November 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 17, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 17, 2025
పెద్దపల్లి: అన్నను కలిసి వెళ్తుండగా అనంతలోకాలకు

సెలవురోజు కావడంతో అన్నను కలవడానికి వచ్చిన బాలికను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. SI శ్రావణ్ కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్(M) తోంగూర్కు చెందిన దాట శివాసిని(8) అన్న దాట శ్రావణ్ సుల్తానాబాద్‌లోని గురుకులంలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాలకు వచ్చింది. అన్నను కలిసి తిరిగెళ్తుండగా బొలెరో ట్రాలీ ఢీకొనడంతో చనిపోయింది.


