News February 22, 2025
శ్రీ సత్య సాయి: 42 కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు

శ్రీ సత్య సాయి జిల్లాలో 42 కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి సంవత్సరం 13,083 మంది, ద్వితీయ సంవత్సరంలో 10,904 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు.
Similar News
News September 17, 2025
నిర్మల్: స్వచ్ఛతాహి సేవ పోస్టర్ల ఆవిష్కరణ

నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో బుధవారం రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ రాజయ్య స్వచ్ఛతాహి సేవ పోస్టర్లను ఈరోజు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల తదితరులు ఉన్నారు.
News September 17, 2025
వ్యాధులు రాకుండా పరిక్షలు చేయించుకోవాలి: కలెక్టర్

అసంక్రమిత వ్యాధులు రాకుండా మహిళలు ముందస్తుగా వైద్య పరిక్షలు చేయించుకోవాలని కలెక్టర్ డా. వినోద్ కుమార్ ప్రజలకు బుధవారం పిలుపునిచ్చారు. జిల్లాలో స్వస్థ్ నారీ.. సశక్తి పరివార్ అభియాన్ కింద 18 సంవత్సరాలు నిండిన మహిళలందరూ తప్పని సరిగా క్యాన్సర్ స్కీనింగ్ పరిక్షలు చేయించుకోవాలన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిక్షలు చేస్తారన్నారు.
News September 17, 2025
ఉరవకొండలో పవర్ విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు

ఉరవకొండలో సెరెంటికా రెన్యూవబుల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 250 మెగావాట్ల పవర్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 50 గాలి మరలను ఏర్పాటు చేసి గ్రిడ్ అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో 320 మందికి ఉపాధి కలుగుతుంది.