News September 10, 2024
శ్వేతారెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

జడ్చర్ల మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి సతీమణి గత రాత్రి అనారోగ్యంతో చెన్నైలో మరణించింది. ఆమె భౌతిక దేహాన్నినాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి MBNR జిల్లా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, జనంపల్లి అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి వాకటి శ్రీహరి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
Similar News
News January 3, 2026
మహబూబ్నగర్ జిల్లా ముఖ్యాంశాలు

✒ఓపెన్ SSC, INTER.. ఫీజు చెల్లించండి
✒సౌత్ జోన్.. పీయూ యోగ జట్టు రెడీ
✒జడ్చర్ల: అనుమానాస్పదంగా బాలిక మృతి
✒రాబోయే ఎన్నికల్లో అధికారం బీజేపీదే:డీకే అరుణ
✒రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
✒MBNR: సంక్రాంతి పండుగ.. ప్రత్యేక బందోబస్తు:SP
✒ప్రారంభమైన టెట్ పరీక్ష
✒పాలమూరు వర్సిటీ క్యాలెండర్ ఆవిష్కరణ
✒రెబల్గా పోటీ చేస్తే సస్పెన్షన్:మల్లు రవి
✒గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
News January 3, 2026
జడ్చర్ల: అనుమానాస్పదంగా బాలిక మృతి

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన పిట్టల మల్లయ్య కుమార్తె రాజేశ్వరి(17) ఇంటిలో అనుమానాస్పదంగా ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించిగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News January 3, 2026
సావిత్రిబాయి ఫూలే సేవలు చిరస్మరణీయం: వీసీ

మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు ఆదర్శప్రాయమని పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. జిఎన్ శ్రీనివాస్ అన్నారు. శనివారం వర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యవక్తగా న్యాయవాది జనార్దన్ పాల్గొని ప్రసంగించగా, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. ప్రవీణ అధ్యక్షత వహించారు.


