News June 24, 2024

షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కలిశారు. నియోజకవర్గంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివెళ్లారు. ఆయన్ను కలిసి రాజకీయ పరిస్థితులు వివరించారు. పార్టీ కోసం పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో తాము పనిచేస్తామని తెలిపారు.

Similar News

News January 3, 2025

నవీపేట్‌లో ముగ్గురు బాలికలు మిస్సింగ్

image

ముగ్గురు బాలికలు అదృశ్యమైన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన విద్యార్థినులు స్థానిక గర్ల్స్ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నారు. గురువారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి వరకు గాలించి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన SI వినయ్ కుమార్ విచారణ చేపట్టారు.

News January 3, 2025

నిజామాబాద్‌లో మహిళా దారుణ హత్య

image

నిజామాబాద్ నగర శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం సారంగాపూర్ వడ్డెర కాలనీలో వెలుగు చూసింది. కాలనీకి చెందిన దుబ్బాక సాయమ్మకు నలుగురు సంతానం. ముగ్గురికి వివాహం కాగా చిన్న కొడుకు దుబాయ్‌లో ఉంటున్నాడు. భర్త చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళ హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న 6వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 3, 2025

NZB: పాముతో చెలగాటం ఆడుతున్న బాలురులు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొందరు చిన్న పిల్లలు పాములతో ప్రమాదకరంగా విన్యాసాలు చేశారు. ఈ ఘటన గురువారం నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయం ముఖ ద్వారం వద్ద చోటుచేసుకుంది. పీల స్కూల్ సమీపంలో పామును పట్టుకొని కొందరు పిల్లలు ఆటలాడుతూ తిరిగారు. కొంచెమైనా భయం లేకుండా పాముతో చెలగాటం ఆడుతూ సెల్ఫీలు దిగారు. పిల్లలపై స్థానిక వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు.