News February 8, 2025
షర్మిలకు కేతిరెడ్డి కౌంటర్

YS జగన్పై షర్మిల చేసిన కామెంట్స్కు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నేత ఎవరో ప్రజలకు తెలుసు. ఆయనకు అవి ఉన్నాయి కాబట్టే ఆడిటర్గా ఉన్న వ్యక్తి పదవులు అనుభవించారు. పార్టీ నుంచి బయటకి వెళ్లాక మీకేదో చెప్పారని దాన్ని మాట్లాడటం, YS కుటుంబ పరువును బజారుకు ఈడుస్తున్నది ఎవరో, ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో ప్రజలందరికీ తెలుసు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 18, 2025
టెక్కలి: గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా అధికారి

టెక్కలి శాఖా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకర్రావు గురువారం పరిశీలించారు. స్థానిక అధికారిణి రూపావతితో పలు అంశాలపై మాట్లాడిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన సెస్ బకాయిలు వస్తే గ్రంథాలయాల అభివృద్ధికి దోహద పడతాయన్నారు. అనంతరం పాఠకులతో మాట్లాడారు.
News September 18, 2025
భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. భూ సేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించి, పరిశ్రమలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News September 18, 2025
చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి

పురుగు మందు తాగి ఆసుత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన కోళ్లపాలెంలో చోటుచేసుకుంది. గురువారం SI శివయ్య వివరాల మేరకు.. కోళ్లపాలెంకు చెందిన B. వాసుబాబు (35) స్థల వివాదం వల్ల మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. అతన్ని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.