News December 17, 2024

షర్మిల.. మీరు ఏ పార్టీలో ఉన్నారు: MLC

image

విశాఖ: ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు. ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారంటూ షర్మిలను ఆమె Xద్వారా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలుగు కాంగ్రెస్ నేతలా షర్మిల మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు షర్మిల ఎవరి మీద పోరాటం చేస్తున్నారో అనే క్లారిటీ ఆమెకైనా ఉందా అని అన్నారు.

Similar News

News November 29, 2025

విశాఖ: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమిలి మండలం దిబ్బడిపాలేనికి చెందిన చిన్మయ ఆనంద్‌ శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిచూసి CPR చేసి వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హెడ్ కానిస్టేబుల్ అమర్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News November 29, 2025

విశాఖ: ‘ఉచిత శిక్షణ.. డిసెంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోండి’

image

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు డిసెంబరు 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు సర్దార్ గౌతులచ్చన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.రాజేశ్వరి తెలిపారు. ప్రవేశ పరీక్ష కూడా డిసెంబరు 7కి వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. విశాఖ జిల్లాకు చెందిన, ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల నేరుగా ఎంవీపీ కాలనీ 6వ సెక్టార్లోని కార్యాలయంలో తమ దరఖాస్తులు అందజేయాలన్నారు.

News November 29, 2025

విశాఖ: రైలులో నొప్పులు.. అంబులెన్స్‌లోనే ప్రసవం

image

విశాఖ రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి రైలులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణి అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పితో అస్వస్థతకు లోనైంది. అధిక రక్తపోటు లక్షణాలు కనిపించడంతో స్టేషన్ చేరుకున్న వెంటనే గేట్ నెం.1 వద్ద ఉన్న అంబులెన్స్‌‌‌లో డా.భాషిణి ప్రియాంక నేతృత్వంలో తక్షణ చికిత్స అందించగా సాధారణ ప్రసవం జరిగింది. అనంతరం తల్లి, శిశువుకి రైల్వే ఆసుపత్రిలో చికిత్స అందించి, KGHకి తరలించారు.