News April 19, 2024

షాకింగ్.. కోదాడలో పశువుల కొవ్వు నుంచి నూనె తయారీ 

image

పశువుల కొవ్వు నుంచి నూనె తయారు చేసిన నూనెను కోదాడలో పోలీసులు పట్టుకున్నారు. 45 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాము తెలిపారు. షేక్.యాదుల్ అనే వ్యక్తి మటన్ దుకాణం నడుపుతుంటాడని.. నూనె తయారు చేసి HYDలో అమ్మేందుకు ఇంట్లో డంపు చేయగా పట్టుకున్నామన్నారు.

Similar News

News October 24, 2025

పత్తిని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తేండి: కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

image

వర్షాల దృష్ట్యా పత్తిని రెండు మూడు రోజులు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి రైతులకు విజ్ఞప్తి చేశారు. మునుగోడులో డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆమె కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పత్తిలో తేమ 8-12 శాతం లోపు ఉండేలా చూడాలని, ‘కపాస్‌ కిసాన్‌’ యాప్ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికే కొనుగోలు ఉంటుందని తెలిపారు.

News October 24, 2025

ధాన్యం నాణ్యత, రైతులకు సౌకర్యం ప్రధానం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో మోసాలు జరగకుండా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధాన్యం నాణ్యత విషయంలో రాజీపడొద్దని, తరుగు విషయంలో రైతుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, తాత్కాలిక విశ్రాంతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

News October 24, 2025

రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్‌

image

ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవ‌ని నల్గొండ జిల్లా ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ హెచ్చరించారు. శుక్ర‌వారం జిల్లాలోని రౌడీ షీటర్స్‌‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌తో సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగేవారికి పోలీసుల సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.