News March 3, 2025
షాకింగ్: నల్లమలలో కార్చిచ్చు (PHOTO)

నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది. దోమలపెంట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన వందలాది హెక్టార్లలో అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News December 2, 2025
మహబూబ్నగర్: జిల్లా ఇన్స్పెక్షన్ ప్యానెల్కు దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్నగర్ జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ల నుంచి జిల్లా ఇన్స్పెక్షన్ ప్యానెల్ (District Inspection Panel) ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (DEO) ఏ.ప్రవీణ్ కుమార్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు, ఆసక్తి గలవారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను డిసెంబర్ 4, 2025 లోపు సమర్పించాలని ఆయన ఆదేశించారు.
News December 2, 2025
300 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

<
News December 2, 2025
590 లీటర్ల అక్రమ మద్యం సీజ్: సూర్యాపేట ఎస్పీ

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఎస్పీ నరసింహ ఉక్కుపాదం మోపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే 50 కేసుల్లో రూ.4.50 లక్షల విలువైన 590 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేసి, 291 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు.


