News March 3, 2025
షాకింగ్: నల్లమలలో కార్చిచ్చు (PHOTO)

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది. దోమలపెంట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన వందలాది హెక్టార్లలో అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News March 22, 2025
వనపర్తి: ‘తిరుమలయ్య గుట్టను పర్యాటకంగా తీర్చిదిద్దాలి’

వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న తిరుమలయ్య గుట్టపై చిట్టడవిలో సంస్థానాధీశుల కాలంలో ప్రతిష్ఠించిన తిరుమలనాథస్వామి ఆలయం సుమారు 600 అడుగుల ఎత్తైన కొండపై ఉంది. ఔషధ గుణాలున్న ఎన్నో చెట్లు ఈ గుట్టపై ఉన్నాయి. ఏటా శ్రావణమాసంలో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, AP రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.
News March 22, 2025
నిర్మల్: ‘ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం పంపిణీ’

ఏప్రిల్ 1నుంచి ప్రజలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డు కలిగి ఉన్న వారంతా సన్నబియ్యం తీసుకునేందుకు అర్హులని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొడ్డు బియ్యాన్ని ఇవ్వవద్దని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలని సూచించారు.
News March 22, 2025
ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకల్లో తారలు వీరే

ఈరోజు సాయంత్రం ఆరింటికి IPL ఓపెనింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. వీటిలో బాలీవుడ్ తారల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. నటీనటులు దిశా పటానీ, శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్ డాన్సులు, శ్రేయా ఘోషల్, అర్జీత్ సింగ్ పాటలు, పంజాబీ ఆర్టిస్ట్ కరణ్ ఔజ్లా ర్యాప్ ఆరంభోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఇక 7.30 గంటలకు KKR, RCB మధ్య మ్యాచ్ మొదలుకానుంది.