News March 3, 2025

షాకింగ్: నల్లమలలో కార్చిచ్చు (PHOTO)

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది. దోమలపెంట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన వందలాది హెక్టార్లలో అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News

News March 1, 2026

మార్చి 3న సింహాచలంలో దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

image

చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3న సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తునట్టు ఈఓ వెంకట్రావు శనివారం తెలిపారు. గ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించి తిరిగి దర్శనాలకు భక్తులకు మరుసటి రోజు అనుమతిస్తామన్నారు. దర్శనాలతో పాటు ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News March 1, 2026

పుష్పగిరి: ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరులు

image

వల్లూరు మండలం పుష్పగిరి సంతాన మల్లేశ్వర ఆలయం వద్ద ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరుని రూపాలు ఉండటం అత్యంత అరుదని చరిత్రకారుడు బి.రమేష్ తెలిపారు. అర్చకులు అఖిల్ స్వామి సమాచారంతో పరిశోధించిన ఆయన ఈ శిల్పం పశుత్వం నుంచి దైవత్వానికి మారడాన్ని సూచిస్తుందన్నారు. చారిత్రక దాడుల్లో నంది ముఖం ధ్వంసమైనా లింగధారినంది, అద్భుతమైన హారాలు, అర్ధ పద్మాసనంలో ఉన్న నందికేశ్వరుని శిల్పకళ విశేషంగా ఆకర్షిస్తుందన్నారు.

News March 1, 2026

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

బాపట్ల జిల్లాలో రబీ సీజన్‌కు మార్చి 21 వరకు 8,339 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పాక్స్‌లలో 1,573 ఎం.టన్నులు, రైతు సేవ కేంద్రాల్లో 714, డీసీఎంఎస్‌లో 214, ప్రైవేట్ రిటైల్ వద్ద 2,298, మార్క్‌ఫెడ్ గోదాముల్లో 3,208 ఎం.టన్నులు నిల్వ ఉన్నాయని చెప్పారు. 45 కిలోల యూరియా బస్తా ధర రూ.266.50 మాత్రమేనని, అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.