News March 3, 2025
షాకింగ్: నల్లమలలో కార్చిచ్చు (PHOTO)

నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది. దోమలపెంట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన వందలాది హెక్టార్లలో అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News December 10, 2025
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో MP బాలయోగి

పార్లమెంట్లోని సీబ్లాక్లో జరిగిన కార్మిక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సమావేశంలో అమలాపురం MP గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు. ఈసమావేశంలో వలస కార్మికుల నైపుణ్య, భాషా శిక్షణ, PMKVY 4.0 పురోగతి వంటి అంశాలపై సమీక్ష జరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ‘డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్’ ‘డ్రాఫ్ట్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్’ను కమిటీ ఆమోదించింది.
News December 10, 2025
SKLM: ‘మనిషి జీవించడానికి మానవ హక్కులు మూలం’

మనిషి జీవించడానికి మానవ హక్కులు మూలమని జిల్లాకోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కే. హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం మెప్మా కార్యాలయంలో బుధవారం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. సమానత్వం, స్వేచ్ఛ, మానవ గౌరవాలకు ఈ చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వీటిని తెలుసుకొని సమాజంలో గౌరవంగా నడుచుకోవాలన్నారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరావు ఉన్నారు.
News December 10, 2025
ప్రకాశం జిల్లాలో సబ్సిడీతో పెట్రోల్.!

ప్రకాశం జిల్లాలో మూడు చక్రాల మోటార్ వాహనాలు కలిగిన అర్హులైన దివ్యాంగులకు పెట్రోల్ సబ్సిడీతో మంజూరు చేయనున్నట్లు సంబంధిత శాఖ సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి పెట్రోల్ సబ్సిడీ మంజూరయిందన్నారు. పెట్రోల్ సబ్సిడీ పొందేందుకు ఆసక్తి గల దివ్యాంగ అభ్యర్థులు కార్యాలయంలో అందించే దరఖాస్తులను 17లోగా అందించాలని ఆమె తెలిపారు.


