News March 3, 2025
షాకింగ్: నల్లమలలో కార్చిచ్చు (PHOTO)

నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది. దోమలపెంట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన వందలాది హెక్టార్లలో అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News December 2, 2025
బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి

బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేట్ కళాశాలలో చదవ లేక పేదలు విద్యకు దూరం అవుతున్నారని చెప్పారు.
News December 2, 2025
VKB: సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం

జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో “ఫ్రాడ్ కా ఫుల్స్టాప్” పేరుతో 42 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ స్నేహ మెహ్రా మంగళవారం తెలిపారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 12 వరకు ప్రతి వారం ఒక్క ప్రత్యేక థీమ్తో ఈ అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
News December 2, 2025
VKB: డీసీసీ అధ్యక్ష నియామక పత్రాన్ని అందుకున్న ధారాసింగ్

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన ధారా సింగ్కు ఆమె నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని నాయకులను, కార్యకర్తలను కలుపుకుని పార్టీని తిరుగులేని శక్తిగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.


