News December 5, 2024
షాకింగ్: సికింద్రాబాద్‌లో మొండెంలేని శిశువు తల

సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కళ్లు చెమర్చే సంఘటన వెలుగుచూసింది. జనరల్‌బజార్‌లోని బంగారం దుకాణాల కాంప్లెక్స్ వద్ద మొండెంలేని పసికందు తల లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన మహంకాళి పోలీసులు CC కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 28, 2025
జూబ్లీ బైపోల్: ప్రచారానికి రేవంత్.. మరి KCR?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను టీపీసీసీ ఖరారు చేసింది. అక్టోబరు 31 నుంచి ప్రచారం చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఇదిలా ఉండగా BRS అధినేత కేసీఆర్ ప్రచారంచేసే తేదీలు ఖరారు కాలేదు. తమ బాస్ ప్రచారం చేస్తే సునీత గెలుస్తారని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రచారంపై పార్టీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.
News October 28, 2025
జూబ్లీ బైపోల్: ఇంటి వద్దే వారికి ఓటు హక్కు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దివ్యాంగులు, వృద్ధులకు ఎన్నికల కమిషన్ ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించింది. ఇందుకు ఓటర్లు ముందుగా తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 102 మంది వృద్ధులు, దివ్యాంగులు దీనికోసం అప్లై చేసుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఈసీ ఈ చర్యలు చేపట్టింది.
News October 28, 2025
HYD: హరీశ్‌రావు ఇంటికి KTR.. కార్యక్రమాలు రద్దు

హరీశ్‌రావు తండ్రి మరణించిన నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి బయలుదేరారు. పితృవియోగం కారణంగా ఈ రోజు జరగాల్సిన పార్టీ కార్యక్రమాలు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కోకాపేటలోని హరీశ్‌రావు ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు చేరుకున్నారు.


