News January 13, 2026

షాక్స్‌గామ్ వ్యాలీపై కన్నేసిన చైనా

image

జమ్ము కశ్మీర్‌లోని షాక్స్‌గామ్‌ వ్యాలీ ప్రాంతాన్ని తమ భూభాగం అంటూ చైనా మరోసారి ప్రకటించుకుంది. ఇప్పటికే ఆ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. చైనా చర్యను పలుమార్లు భారత్ ఖండించింది. అయితే షాక్స్‌గామ్‌ ప్రాంతం తమ భూభాగమేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ మీడియా సమావేశంలో తెలిపారు. కాగా 1963లో పాక్ అక్రమంగా 5,180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు కట్టబెట్టింది.

Similar News

News February 14, 2026

KMR: మున్సిపల్ ‘జోరు’.. పరిషత్ ‘పై నజర్’

image

TG మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పట్టణ ఓటర్లు అందించిన భారీ మెజారిటీని పురస్కరించుకుని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరలోనే MPTC, ZPTC ఎన్నికలను పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు చతికిలపడటంతో, గ్రామీణ ప్రాంతాల్లో వారికి అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.

News February 14, 2026

KMR: పాతికేళ్ల తర్వాత మళ్లీ విజయం

image

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో నిట్టు గంగాధర్ రావు అరుదైన విజయాన్ని సాధించారు. 2001లో సరంపల్లి సర్పంచ్‌గా సేవలందించిన ఆయన మళ్లీ పాతికేళ్ల విరామం తర్వాత 2026 ఎన్నికల్లో కౌన్సిలర్‌గా భారీ మెజారిటీతో గెలుపొందారు. 2018లో సరంపల్లి కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమైన నేపథ్యంలో ఈ విజయం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

News February 14, 2026

కొత్తగూడెం మేయర్ పదవిని కైవసం చేసుకుంటాం: సీపీఐ

image

TG: కొత్తగూడెంలో మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఇప్పటికే KTR కాల్ చేసి BRS తరఫున మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు. ఇండిపెండెంట్ల మద్దతు కూడా ఉందని తెలిపారు. అయితే కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చ చేయలేదని పేర్కొన్నారు. మేయర్ పదవి గిరిజనులకే ఇస్తామని తెలిపారు. కాగా EC ప్రకారం ఇక్కడ CPI 22, CONG 22, BRS 8, ఇండిపెండెంట్లు 6 సీట్లు, BJP, CPM తలో చోట గెలిచాయి.