News November 22, 2024

షాద్‌నగర్‌లో గుడిపై దాడి.. బీజేపీ ఫైర్

image

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని వివేకానంద కాలనీలో బసవన్న దేవాలయంలో దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేయడంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News December 4, 2025

HYD: గూగుల్‌మ్యాప్స్ ఫాలో అవుతున్నారా? జాగ్రత్త!

image

గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్తున్నారా? మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రుళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. బోడుప్పల్‌లో ఓ వ్యక్తి తన వాహనంలో గుడ్డిగా దీన్ని నమ్మి బోడుప్పల్- పోచారం రూట్లో వెళ్లాడు. కుడివైపు మొత్తం మట్టి రోడ్డు ఉన్నప్పటికీ నావిగేషన్ అటువైపే చూపించింది. కొద్ది దూరం వెళ్లాక రోడ్డు లేకపోగా, భారీ గుంతలో పడ్డట్టు తెలిపారు. మీకూ ఇలా రాంగ్ డైరెక్షన్ చూపించిందా?

News December 4, 2025

HYD: పెరుగుతున్న కేసులు.. జాగ్రత్త!

image

HYDలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సలు దాదాపు పదికిపైగా ఆస్పత్రులు అందిస్తున్నాయి. అయితే.. నెలకు 200 మంది వరకు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకుంటున్నట్లు MNJ వైద్యులు గుర్తించారు. ఇన్ఫెక్షన్లు, ల్యూకేమియా, ఇన్ఫోమా, మైలోమా వంటి బ్లడ్ క్యాన్సర్లకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ పరిష్కారమని చెబుతున్నారు. ఊబకాయులు, పెరగుతున్న వయసు, పురుషుల్లో అధికంగా దీని లక్షణాలు కనిపిస్తున్నట్లు తేల్చారు.

News December 4, 2025

HYD: చెస్ ఆడతారా.. ₹22లక్షలు గెలుచుకోవచ్చు

image

తెలంగాణలో తొలి అతిపెద్ద ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్ డిసెంబర్ 20, 21 తేదీల్లో హిటెక్స్‌లో జరుగనుంది. ఎక్కారా చెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్‌‌లో గెలుపొందితే ₹22.22 లక్షలు ప్రైజ్ మనీ సొంత చేసుకోవచ్చు. రాష్ట్రంలో భారీ స్థాయిలో జరుగుతున్న మొదటి చెస్ టోర్నీ అని నిర్వాహకులు తెలిపారు. SHARE IT