News March 23, 2025
షాద్నగర్లో హాస్టల్పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం

షాద్నగర్ పట్టణంలోని బాలుర హాస్టల్ పైఅంతస్తు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి దూకాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్కి చెందిన చందు ఈరోజు మధ్యాహ్నం బిల్డింగ్ పైనుంచి అకస్మాత్తుగా కిందికి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News December 9, 2025
MBNR: స్వామివారి తలనీలాలకు కోటి రూపాయల టెండర్

తెలంగాణ తిరుపతిగా పేరు ప్రఖ్యాతలుగాంచిన మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం టెండర్లు నిర్వహించారు. పది సంవత్సరాల క్రితం పలికిన విధంగా ఈసారి కూడా కోటి రూపాయలు తలనీలాలకు రెండేళ్ల కాలపరిమితికి ఐదుగురు వ్యాపారులు పాల్గొన్నారు. శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ వారికి దక్కిందని ఆలయ ఈవో శ్రీనివాసరాజు తెలిపారు.
News December 9, 2025
MBNR: ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరుకావాలి: కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు కేటాయించిన పి.ఓలు, ఓ.పి.ఓలు ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ విజయేందిర బోయి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై ఎన్నికల నిబంధనల అనుసరించి క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు.
News December 9, 2025
RR, VKB: మీ ఊర్లో మీ ఓటు ఉందా?

RR, VKB జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతుంది. ఎలక్షన్ కమిషన్ జిల్లాల్లో ప్రతి మండలానికి సంబంధించి గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ లిస్టు అందుబాటులో ఉంచింది. తెలుగు, ఇంగ్లిష్ ఫార్మాట్లలో ఓటర్ లిస్ట్ అందుబాటులో ఉంది. గ్రామం, వార్డుల వారీగా ఓటర్ల వివరాలు తెలుసుకోవడానికి https://finalgprolls.tsec.gov.in లింక్ పైక్లిక్ చేయండి. తర్వత జిల్లా, మండలం, గ్రామం ఎంచుకోండి. వివరాలు మీకు కనిపిస్తాయి.


