News July 9, 2024

షాద్‌నగర్: అంతర్జాతీయ దొంగల అరెస్ట్

image

షాద్‌నగర్ పట్టణంలోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డ అంతర్జాతీయ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 30న అయ్యప్ప కాలనీలో నివాసముండే గాదం రమేష్ ఇంట్లో పాచి పనికి నేపాల్‌కు చెందిన ప్రసన్న బాదువాల్ వచ్చింది. ఆమె భర్త ప్రశాంత్ బదువాల్‌తో కలిసి రమేశ్ ఇంట్లో 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకున్నారు.

Similar News

News November 19, 2025

MBNR: U-19 క్రికెట్.. రిపోర్ట్ చేయండి

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల బాలికలకు క్రికెట్ జట్ల ఎంపికలను జడ్చర్లలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 20న ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, వైట్ డ్రెస్ కోడ్, పూర్తి కిట్టుతో హాజరు కావాలన్నారు. క్రీడాకారులు మహబూబ్ నగర్ పీడీ మోసీన్‌కు ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలన్నారు.

News November 19, 2025

ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

image

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.