News June 29, 2024
షాద్‌నగర్ ఘటనలో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి: డీకే అరుణ

షాద్‌నగర్ పరిధిలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విచారణ వ్యక్తం చేశారు. పేలుడులో ఐదుగురు కార్మికులు మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఘటలో మృతిచెందిన, గాయపడ్డ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
Similar News
News November 18, 2025
బాలానగర్: ఫోన్‌పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్‌పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.

News November 17, 2025
బాలానగర్‌లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్‌లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.