News June 17, 2024
షాద్నగర్: చేతబడి.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..!

షాద్నగర్ పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చౌదరిగూడ మండలం రావిర్యాల వాసి పద్మమ్మ చేతబడి చేస్తుందన్న నెపంతో కొందరు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. పద్మమ్మ శ్మశానం నుంచి మృతదేహాల బూడిద తీసుకొని వచ్చి గ్రామంలోని ఇళ్లపై చల్లుతుండడాన్ని గ్రామస్థులు గమనించి ఆమెను దారుణంగా కొట్టారు. ఆమెపై దాడి చేసిన 9మందిపై కేసు నమోదైంది. మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని SI సక్రం తెలిపారు.
Similar News
News December 8, 2025
ఉడిత్యాలలో..11.4 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత

మహబూబ్ నగర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. బాలానగర్ మండలంలోని ఉడిత్యాలలో 11.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 11.7, గండీడ్ మండలం సల్కర్ పేట 11.8, మిడ్జిల్ మండలం, దోనూరు 12.2, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 12.6, భూత్పూర్ 13.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 13.3, మహమ్మదాబాద్, కోయిలకొండ మండలం పారుపల్లి 13.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News December 8, 2025
ఈనెల 19 నుంచి పిల్లల మర్రి బాలోత్సవాలు

ఈనెల 19 నుంచి పిల్లలమర్రి బాలోత్సవాలు నిర్వహిస్తున్నారని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. సాంస్కృతిక సాంప్రదాయక నృత్యాలు ,విద్యార్థులకు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
News December 7, 2025
గల్లంతైన ఆరు గ్యారంటీలు: డీకే అరుణ

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు పెట్టి గెలిచారని మహబూబ్ నగర్ డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తిగా గల్లంతయ్యాయని విమర్శించారు. రెండు సంవత్సరాల విజయోత్సవాలు జరుపుకునే అర్హత వారికి లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.


