News May 11, 2024
షాద్నగర్: పెట్టుబడులు గుజరాత్కు తరలించేందుకు BJP కుట్ర :CM

HYDకు వచ్చే పెట్టుబడులు గుజరాత్కు తరలించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. అభివృద్ధి జరగాలన్నా.. ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నారు. ఉత్తర్ప్రదేశ్లో ఉన్న మతకలహాల వల్లే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
Similar News
News November 28, 2025
MBNR: ‘టీ-పోల్’ యాప్ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘టీ-పోల్’ మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి కోరారు. ఈ యాప్ ద్వారా ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవచ్చని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే కూడా తెలియజేసే అవకాశం ఉంటుందని వివరించారు.
News November 28, 2025
MBNR: జీపీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ఎన్నిసార్లు ఎన్నికలు నిర్వహించినా ప్రతిసారీ సవాళ్లు ఎదురవుతాయని, అందువల్ల అధికారులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News November 28, 2025
MBNR: కొనసాగుతున్న చలి తీవ్రత

మహబూబ్ నగర్ జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. జిల్లాలో అత్యల్పంగా మిడ్జిల్ మండలం దోనూరులో 13.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 14.1, రాజాపూర్ 14.4, మిడ్జిల్ మండలం కొత్తపల్లి, భూత్పూర్ 14.9, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.0, హన్వాడ 15.1, మిడ్జిల్ 15.2, మూసాపేట 15.5, మహమ్మదాబాద్ 15.7, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 15.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


