News February 11, 2025
షాద్‌నగర్: రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సోలిపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. షాద్‌నగర్ పట్టణానికి చెందిన గౌస్ పాషా (45) తండ్రి షేక్ ఖాసిం భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్టేషన్ మాస్టర్ రాహుల్ కుమార్ ఫిర్యాదుతో రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 28, 2025
HYDలో 50 మంది GOVT అధికారుల తొలగింపు..!

పదవీ విరమణ పొందినా చాలా మంది ఇంకా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్, రీ అపాయింట్‌మెంట్ పేరిట ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇలాంటివారు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 50 మంది ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. దీంతో 50 మంది వరకు మార్చి 31న ఇంటిముఖం పట్టనున్నారు. అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఇంకా కిందిస్థాయి సిబ్బంది వీరిలో ఉన్నారు.
News March 28, 2025
HYDలో తగ్గిన ఇళ్ల కొనుగోళ్లు: KTR

హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో HYDలో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని KTR Xలో ఆరోపించారు. పేదల ఇళ్లమీదకు బుల్డోజర్‌లు పంపి పెద్దలతో సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.‘గత త్రైమాసికంలో 49% ఇళ్ల విక్రయాలు తగ్గాయి. ఆఫీస్‌ల లీజింగ్ కూడా పాతాళానికి పడిపోయింది. ఈ ఏడాది 3 నెలల్లో కొనుగోళ్లు 41% తగ్గాయి. ప్రభుత్వం అబద్ధాలు మాని అభివృద్ధి చేయాలి, కూల్చడం కాదు, కట్టడం నేర్చుకోవాలి’ అని రాసుకొచ్చారు.
News March 28, 2025
HYD: నూతనంగా 13 ఎక్సైజ్ స్టేషన్‌లు

కల్తీ కల్లుతో పాటు మత్తు పదార్థాల వినియోగం తదితర కారణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఎక్సైజ్ స్టేషన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో 13 స్టేషన్లను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మారేడ్‌పల్లి, చిక్కడపల్లి, గండిపేట, కొండాపూర్, మీర్‌పేట్, పెద్దఅంబర్‌పేట్, కొంపల్లి, కూకట్‌పల్లి, కాప్రా, నాచారం, అల్వాల్, అమీన్‌పూర్, బంజారాహిల్స్‌లలో ఏర్పాటు చేయనున్నారు.