News February 8, 2025
షాద్‌నగర్: 10న అప్రెంటిస్ షిప్ మేళా

షాద్‌నగర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 10వ తేదీన అప్రెంటిస్ షిప్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 10 గం.లకు కళాశాలలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News February 14, 2026
MBNR: లెక్కింపు ప్రక్రియ విజయవంతం: ఎస్పీ

పాలమూరు కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిందని ఎస్పీ జానకి తెలిపారు. లెక్కింపు కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందన్నారు. వారం రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News February 14, 2026
MBNR: మున్సిపల్ ఎన్నికలు.. మహిళా అభ్యర్థుల విజయకేతనం

మహబూబ్‌నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. జిల్లాలోని రెండు పురపాలికలు, ఒక నగరపాలికలో జరిగిన ఎన్నికల్లో 32 మందికి పైగా మహిళలు విజయం సాధించి తమ సత్తా చాటారు. దేవరకద్ర, భూత్పూర్, మహబూబ్‌నగర్‌లలో మహిళల అఖండ విజయాలు రాజకీయాల్లో మారుతున్న ట్రెండ్‌కు, వారి ఉత్తేజానికి నిదర్శనంగా నిలిచాయి.
News February 14, 2026
మహబూబ్‌నగర్‌లో రీకౌంటింగ్..!

మహబూబ్‌నగర్ మేయర్ పీఠం ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లలో పోలింగ్ జరిగింది. 58వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించారు. 59 స్థానాల్లో కాంగ్రెస్-29, BRS-15, BJP-7, ఇతరులు 8 మంది విజయం సాధించారు. అయితే 53వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థిపై 29 ఓట్ల మెజార్టీ రాగా.. అక్కడ రీకౌంటింగ్ జరుగుతోంది.


