News March 24, 2024
షాద్‌నగర్: RTC బస్సులో భారీగా నగదు, వెండి సీజ్

షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద పోలీ దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. RTC బస్సులో ఏలాంటి పత్రాలు లేకుండా ఓ వ్యక్తి రూ.16,50 లక్షల నగదు, వెండి తరలిస్తుండగా సీజ్ చేశారు. వనపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో జయదేవ్ అనే యువకుడు అక్రమంగా తరలిస్తున్న నగదు వెండిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 12, 2025
MBNR: వాహనదారులు, ప్రజలకు భద్రతా సూచనలు: ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లాలో శీతాకాలం తీవ్రం కావడంతో రాత్రి, తెల్లవారుజామున పొగమంచు అధికంగా ఏర్పడుతోంది. దీంతో విజిబిలిటీ తగ్గి ప్రమాదాలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ఉదయం 5 నుంచి 8, రాత్రి 8 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, వాహనదారులు, వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
News December 12, 2025
MBNR : భూత్పూర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భూత్పూర్‌లో 9.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిరి వెంకటాపుర్ 9.7°C, దోనూరు 9.8°C, పారుపల్లి 10.4°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
News December 12, 2025
MBNR జిల్లాలో FINAL పోలింగ్ శాతం

MBNR జిల్లాలో 139 గ్రామ పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 83.04 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.


