News February 6, 2025

షిప్పింగ్ హార్బర్ నిర్మాణం సకాలంలో పూర్తి: అనకాపల్లి ఎంపీ

image

పూడిమడక వద్ద చేపట్టిన షిప్పింగ్ హార్బర్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేస్తామని కేంద్ర పోర్టులు షిప్పింగ్ శాఖామంత్రి సర్బానంద్ సోనోవాల్ హామీ ఇచ్చినట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ బుధవారం తెలిపారు. శీతాకాల సమావేశంలో ఈ అంశాన్ని తను పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగిందన్నారు. దీనిపై కేంద్రమంత్రి స్పందించి లేఖ రాసినట్లు ఎంపీ పేర్కొన్నారు.

Similar News

News October 23, 2025

3,800 దరఖాస్తులు పెండింగ్‌పై జేసీ రాహుల్‌రెడ్డి ఆగ్రహం

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న జాయింట్ ఎల్‌పీఎం దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి రీ-సర్వే, హౌసింగ్ ఫర్ ఆల్, పీజీఆర్ఎస్ పిటిషన్ల పరిష్కారాలపై ఆయన గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఇంకా 3,800 జాయింట్ ఎల్‌పీఎంలు పెండింగ్ ఉండటంపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.

News October 23, 2025

మానవపాడు: ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.50 వేల ఫైన్

image

ఏపీ నుంచి తెలంగాణలోని గ్రామాలవైపు అక్రమంగా ఇసుకను తరలించే వాహనాలు ఏవైనా పట్టుపడితే కేసులు, ఫైన్లు తప్పనిసరి వేస్తున్నామని తహశీల్దార్ జోషి శ్రీనివాస్ రావు అన్నారు. ఈ నెల 9న ఏపీలోని తాడిపత్రి నుంచి ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను ఎస్సై చంద్రకాంత్ పట్టుకొని కేసు నమోదు చేశారు. అట్టి వాహనాలకు ఒక్కొక్క వాహనంకు రూ.50 వేల ఫైన్ వేశామని, రెండోసారి వాహనం ఇసుకను రవాణా చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.

News October 23, 2025

ఆమరణ దీక్షకు దిగుతా: షర్మిల

image

ఆంధ్ర రత్న భవనం వద్ద వైఎస్ షర్మిల వర్షంలో తడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.700 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సేవలు పునరుద్ధరించకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు.